ఢిల్లీలో కలకలం: కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతల విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వారిని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడబోమని హామీ తీసుకున్న అనంతరం మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విడిచిపెట్టినట్లు సమాచారం వెలువడింది.