రోజ్‌గార్ మేళా ద్వారా యాభై వేల నియామక పత్రాలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా నిర్వహించనున్న రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన నూతన అభ్యర్థులకు యాభై వేలకు పైగా నియామక పత్రాలను అందజేయనున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది.