ముంబై ఐఐటీలో చాట్‌జీపీటీ వాడుతూ పట్టుబడిన విద్యార్థి ఆత్మహత్య

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

ముంబై ఐఐటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మిడ్-సెమిస్టర్ పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా చాట్‌జీపీటీని ఉపయోగిస్తూ పట్టుబడిన 19 ఏళ్ల బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన నిర్వహించగా, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని ఐఐటీ యాజమాన్యం స్పష్టం చేసింది.