ఫ్లిప్కార్ట్లో భారీ అవినీతి కుంభకోణం: రూ.150 కోట్ల కిక్బ్యాక్లపై వాల్మార్ట్ విచారణ

రిపోర్టర్: శివ స్థలం: Bengaluru

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో సుమారు నూట యాభై కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం కలకలం రేపినట్లు మనీకంట్రోల్ నివేదించింది. వెండర్ల నుంచి భారీగా కమీషన్లు తీసుకుని వారికి ప్రాధాన్యత కల్పించిన ఉద్యోగులపై అమెరికన్ రిటైల్ సంస్థ వాల్మార్ట్ అంతర్గత విచారణ ప్రారంభించిందని సీనియర్ జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ జోశ్యుల వెల్లడించారు. బిజినెస్ ఛానెల్ను అడ్డాగా చేసుకుని కొందరు ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు విజిల్బ్లోయర్లు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం ఉలిక్కిపడింది.