వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి

రిపోర్టర్: నరేష్ స్థలం: కావలి

కావలి రూరల్ పరిధిలోని సిరిపురం గ్రామంలో ఆరుబయట ఆడుకుంటున్న మూడో తరగతి బాలుడు దేవాన్ష్పై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా, వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే భయమేస్తోందని, మున్సిపాలిటీ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమ పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు.