కూటమి ప్రభుత్వానికి వినాయక ఉత్సవాలపై చిత్తశుద్ధి లేదన్న వెల్లంపల్లి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎన్ని పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. హిందూ మతాన్ని రాజకీయాల కోసం వాడేసుకోవడం తప్ప, కనీసం విగ్రహాల నిమజ్జనానికి కూడా సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.