20 ఏళ్ల నాటి పత్రాల కోసం ప్రజల అవస్థలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు జారీ చేసిన నోటీసులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని, 20 ఏళ్ల క్రితం నాటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని అధికారులు ఆదేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో నిర్వహిస్తున్న నోటీసు హియరింగ్ సభలకు హాజరవుతున్న ప్రజలు, పాత పత్రాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు నిబంధనలను సరళతరం చేయాలని, తమ ఇబ్బందులను అర్థం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.