ఆమనగల్లులో చిరువ్యాపారుల తొలగింపుపై తల్లోజు ఆచారి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రి ముందు 40 ఏళ్లుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మండిపడ్డారు. బాధితుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేదల బతుకులతో చెలగాటం ఆడవద్దని అధికారులను హెచ్చరించారు.