తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.