రాష్ట్రంలో బార్లు బంద్: వరుసగా రెండో రోజు మూతపడిన రెస్టారెంట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు సోమ, మంగళవారాల్లో పూర్తిగా మూసి ఉంటాయని రాష్ట్ర అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రివిలేజ్ ఫీజును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట యజమానులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపే వరకు నిరసనలు ఆపేది లేదని తేల్చిచెప్పారు. బార్లు బంద్ కావడంతో వైన్ షాపుల ముందు మందుబాబుల రద్దీ విపరీతంగా పెరిగింది.