అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జలదంకిలో రైస్ మిల్లు సీజ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: జలదంకి
ధాన్యం అక్రమ విక్రయాలపై పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీనివాసులు తీవ్రంగా హెచ్చరించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలోని ఎస్.ఎన్.రెడ్డి రైస్ మిల్లులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత సీజన్లకు సంబంధించిన భారీ ధాన్యం నిల్వలు అక్రమంగా తరలిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు మిల్లును సీజ్ చేసి, యజమాని సోము నాగేశ్వరరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ డీఎం శ్రీనివాసులు స్పష్టం చేశారు.