విశాఖలో తప్పిపోయిన బాలుడి ఆచూకీ గుర్తింపు: కుటుంబ సభ్యులకు అప్పగింత
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
తప్పిపోయిన పదమూడేళ్ల బాలుడి ఆచూకీని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కనిపెట్టి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిన బాలుడి కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గాలించామని అధికారులు పేర్కొన్నారు. విజయవాడలో బాలుడిని గుర్తించి క్షేమంగా తీసుకువచ్చిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారని స్పష్టం చేశారు.