మాజీ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వ భద్రత పూర్తిగా రద్దు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించబడిన కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెకు కల్పించిన అధికారిక భద్రతను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, గన్‌మన్లను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుంది. పదవి కోల్పోయిన మరుసటి రోజే ఈ చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం చెబుతున్నా, కొండా కుటుంబానికి పంపిన సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.