కార్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సోర్బా థామస్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
హల్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు సోర్బా థామస్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రాక్టీస్‌కు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, పూర్తిగా సురక్షితంగా ఉన్నారని క్లబ్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.