నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగిస్తే కఠిన చర్యలని ఎస్సై హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శాయంపేట
జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో గురువారం రాత్రి అనధికారికంగా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిజాంపల్లికి చెందిన నిర్వాహకుడు చింతల సురేష్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం సృష్టిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.