పర్యాటకం ముసుగులో పాక్ ఉగ్రవాద కుట్ర: కరాచీ సమీపంలో లష్కరే శిక్షణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కరాచీ
టూరిజం ముసుగులో లష్కరే తొయిబా ఉగ్రవాదులకు పాకిస్థాన్ సముద్ర మార్గంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కరాచీకి సమీపంలోని ఛార్నా దీవి వద్ద స్కూబా డైవింగ్, కాంబ్యాట్ స్విమ్మింగ్ లలో ఈ మెరైన్ వింగ్ ఉగ్రవాదులకు తర్ఫీదునిస్తున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. గతంలో ముంబై దాడుల తరహాలోనే మరోసారి సముద్ర మార్గం ద్వారా భారత్ పై భారీ దాడులకు కుట్ర పన్నుతున్న ఈ మూకల కదలికలపై నిఘా సంస్థలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.