తండ్రి మరణంపై నిమ్రత్ కౌర్ భావోద్వేగం: ఉగ్రవాదుల అపహరణ జ్ఞాపకాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Srinagar

తన తండ్రి మేజర్ భూపేందర్ సింగ్ను ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన నాటి భయానక ఘటనను ప్రముఖ నటి నిమ్రత్ కౌర్ గుర్తుచేసుకున్నారు. కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తన తండ్రిని 1994 జనవరిలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, ఏడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠ తర్వాత ఆయన మరణవార్త తమకు అందిందని ఆమె ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కష్టకాలంలో తన తల్లి పడిన వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు.