ప్రమాదంలో డాక్టర్ జగదీశ్ మృతికి మాజీ మంత్రి పువ్వాడ సంతాపం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం మమత ఆసుపత్రి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేవని కొనియాడారు. ఆయన మరణం స్థానిక వైద్య రంగానికి మరియు కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యం ప్రసాదించాలని కోరారు.