రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ సత్యసాయి
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ వెల్లడించారు. రూ.11,085 కోట్ల భారీ వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 16,500 కిలోమీటర్ల మే అంతర్గత, అప్రోచ్ అలాగే బీటీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.