మురసు తుపాను హెచ్చరిక: అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

మురసు తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు తక్షణ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రవాహాలపై నిరంతరం నిశితంగా దృష్టి సారించాలన్నారు.