రైజ్ అండ్ ఫాల్ షోలో ప్రియాంకపై షెహజాద్ తీవ్ర వ్యాఖ్యలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
ప్రముఖ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 లో పోటీదారుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. తాజా ఎపిసోడ్లో ప్రియాంక చాహర్ చౌదరిని షెహజాద్ పూనావాలా గోల్డ్ డిగ్గర్ అని సంబోధించారని స్వరా భాస్కర్‌తో మాట్లాడుతూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి తానే బాధ్యురాలనని, అలాంటి తనను అలా అనడం బాధించిందని కన్నీటిపర్యంతమయ్యారు. కోపంలో ఎదుటివారు ఎంత క్షోభకు గురవుతారో ఆలోచించరని స్వరా భాస్కర్ తెలిపారు.