టెక్ రంగంలో భారీ షాక్: ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ అమెజాన్
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
అమెజాన్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కలకలం రేపింది. డివైసెస్ యూనిట్లో పనిచేస్తున్న రెండు వందల యాభై మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించినట్లు వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ వెల్లడించారు. కృత్రిమ మేధస్సు రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, సంస్థ పనితీరును మెరుగుపరుచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ కోతలతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.