బాలీవుడ్ డైరెక్టర్ ఆఫర్ను తిరస్కరించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

బాలీవుడ్లో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా చెప్పిన కొత్త కథను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.