వైకాపా మద్యం కుంభకోణంలో త్వరలో పెద్ద చేపలు జైలుకెళ్తాయి

రిపోర్టర్: విజయ్ స్థలం: తూర్పు గోదావరి

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రూ.3,200 కోట్ల అవినీతి చోటుచేసుకుందని, ఈ కుంభకోణంలో ఇప్పటికే కొందరు అరెస్టవ్వగా త్వరలో పెద్ద చేపలు జైలుకెళ్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాజమహేంద్రవరంలో స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని, రవాణా, నియామక ఏజెన్సీల ఏర్పాటులో ఆయనే అంతిమ లబ్ధిదారుడని ఆరోపించారు.