ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన అవసరమన్న ఎంపీడీవో శ్రీనివాసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రాయపర్తి
పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాయపర్తి ఎంపీడీవో పాక శ్రీనివాసులు కోరారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నివారణపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.