ఉత్తరాంధ్రను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం భారీ వర్షాల హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: Visakhapatnam
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకుని కదులుతుండటంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉండటంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.