మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

మాజీ ప్రధాని మరియు ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ ప్రపంచ స్థాయి ఆర్థికవేత్త అని, అత్యున్నత విలువలతో కూడిన రాజనీతిజ్ఞుడని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు. అలాగే తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ యోధురాలి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాలు భావితరాలకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.