BRSLP సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: chandrareddy damidi స్థలం: గజ్వేల్

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడు, ఆ బూతుల వీరుడు చర్చలకు అసెంబ్లీకి రమ్మంటున్నాడు, బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు నేను అసెంబ్లీకి రావడం అవసరమా..? నేను అసెంబ్లీ రావాలా..? వద్దా..? మీరే చెప్పండి. రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదివారం రోజున ఎర్రబెల్లి కేసిఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న బిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నా చావు కోరుతూ పదేపదే స్పీచ్లు ఇస్తున్నారు. అసెంబ్లీకి రావాలని ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కనిపిస్తోంది. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం.