పాలనలో తెలుగు అమలుపై హైకోర్టు ఆగ్రహం: అధికారులకు తీవ్ర చురకలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
పాలనలో తెలుగు భాష అమలుపై స్థాయీ నివేదిక దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. కారణాలు చెప్పకుండా అదనపు సమయం కోరడాన్ని ధర్మాసనం ఆక్షేపించిందని, నివేదికలో జాప్యంపై వివరణ ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిందని సమాచారం.