విశాఖలో బెల్ట్ షాపులపై పోలీసుల ఆకస్మిక దాడులు

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చిన్న ఉప్పాడ, నిడిగట్టు, ఎగువపేట, సిటీ నగర్ మరియు చిప్పాడ గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాల కోసం ఉంచిన మొత్తం నలభై మూడు మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అక్రమ వ్యాపారులపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.