వైసీపీ నేతలపై అక్రమ కేసులంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపాటు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Vijayawada
వైసీపీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విజయవాడలో సీపీని కలిసి తమ పార్టీ నేతల మీద పెట్టిన కేసుల వివరాలపై వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. పోలీసుల తీరుపై కోర్టులు సైతం చివాట్లు పెట్టినా వైఖరి మారలేదని ఆరోపించారు. మంత్రుల కనుసన్నల్లోనే రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, వేధింపులు ఆపకపోతే అందరం స్టేషన్ల వద్దకు వస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.