వైద్యుల ఆలస్యంపై ఆసుపత్రిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కిడ్నీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పది గంటలైనా వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీ బాధితులు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకూడదని స్పష్టం చేస్తూ, సిబ్బంది హాజరు వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.