వైన్ షాపులు బంద్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై నిషేధం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అలాగే నవంబర్ 3న ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం విక్రయాలు నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.