'బంగారు భవిష్యత్తు ఆశతో మోసపోకండి': నకిలీ కన్సల్టెన్సీలపై విశాఖలో హెచ్చరిక
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నకిలీ కన్సల్టెన్సీలు మోసగిస్తున్న ఘటనలు విశాఖపట్నంలో కలకలం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఆకర్షించే ప్రకటనలతో రూ.లక్షల్లో వసూలు చేసి కేటుగాళ్లు నిలువునా ముంచుతున్నారని ఐటీ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీల క్రెడిబులిటీ పరిశీలించాలని, మోసాలపై వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన హెచ్చరించారు.