రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ప్రేమ వేధింపుల కారణంగా దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, విద్యార్థులు, తల్లిదండ్రుల భయాందోళనలను తొలగించేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ బృందాలను రంగంలోకి దించామని స్పష్టం చేశారు.