ములుగు మున్సిపాలిటీలో ఆస్తి పన్నులపై వస్తున్న అపోహలను ఖండించిన కమిషనర్ సంపత్
రిపోర్టర్: రాజేష్
స్థలం: ములుగు
ములుగు మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు పెంచారంటూ వస్తున్న వార్తల్ లో ఎలాంటి నిజం లేదని మున్సిపల్ కమిషనర్ సంపత్ స్పష్టం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివాస గృహాలపై గతంలో ఉన్న పన్ను రేట్లే కొనసాగుతున్నాయని, కేవలం వాణిజ్య భవనాలకు మాత్రమే తొలిసారిగా నిబంధనల ప్రకారం పన్ను ఖరారు చేశామని వివరించారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.