ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ భాస్కర్‌రావు
రిపోర్టర్: సతీష్
స్థలం: యాదాద్రి భువనగిరి
భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజల నుంచి 94 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి అర్జీలు స్వీకరించగా అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 55 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.