రేపల్లె వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ పై పోలీసుల దౌర్జన్యం

రిపోర్టర్: వెంకట్ స్థలం: రేపల్లె

డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తూ రేపల్లెలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ పేటా మోహన్ కృష్ణతో పోలీసులు దురుసుగా ప్రవర్తించి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. టీడీపీ గూండాలకు కొమ్ముకాస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.