బిమాన్ బంగ్లాదేశ్ విమానంలో ప్రయాణికుల మధ్య బాహాబాహీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: అంతర్జాతీయం

లండన్ నుంచి ఢాకా వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్నారు. వీరి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తోటి ప్రయాణికులు, సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ మహబూబుద్దీన్ అహ్మద్ తెలిపారు.