భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్ ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కేరళ
ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ తాజాగా పిక్నిక్ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించింది. కిరణ్ జోసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాలో సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.