నర్సంపేట డివిజన్లో కోతుల స్వైరవిహారం: రైతుపై దాడితో తీవ్ర గాయాలు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట డివిజన్ పరిధిలో కోతుల దాడులు తీవ్రం కావడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా నల్లబెల్లి మండలం బాల్యతండాకు చెందిన రైతు భాజ్యపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం ఓ మహిళపై కూడా కోతులు దాడికి తెగబడ్డాయి. జనావాసాల్లోకి చొరబడుతున్న కోతుల బెడదను తక్షణమే అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.