ఢిల్లీలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Delhi
దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్‌వెస్ట్ ఢిల్లీ స్వరూప్ నగర్ ప్రాంతంలో పదహారేళ్ల బాలికపై టెంపోలో సామూహిక అత్యాచారం జరిపి, కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివమ్ తో పాటు మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు మరియు టెంపోను స్వాధీనం చేసుకున్నారు.