బెంగళూరు వేదికగా నేడు పనామాతో భారత్ అంతర్జాతీయ ఫుట్బాల్ సమరం

రిపోర్టర్: నరేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో నేడు భారత్, పనామా జట్లు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో తలపడనున్నాయి. సీనియర్ స్థాయిలో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. కెప్టెన్ గురుప్రీత్ సింగ్ సంధు నేతృత్వంలోని భారత జట్టు విజయంపై కన్నేసింది. ఈ కీలక పోరును సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు సోనీలివ్ యాప్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న భారత్కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది.