ఎస్సీ అభివృద్ధికి రూ.226 కోట్లతో కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.226 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ నిధులు వెచ్చించనున్నారు. పీఎం అజయ్ పథకం కింద కేంద్రం నుంచి రూ.100 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్ కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నెలాఖరుకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.