నిబంధనలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్స్ లేని కూడలి లాంటిది
రిపోర్టర్: శివ
స్థలం: India
భారత్ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్స్ లేని కూడలి లాంటిదని, అక్కడ గందరగోళం మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు. బలవంతుడిదే రాజ్యం అనే పాతకాలపు ఆలోచనా విధానానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాలు కలిసికట్టుగా రాయాలని పిలుపునిచ్చారు.