'తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను': సందీప్ కిషన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలుగు హీరోగా తాను చాలా గర్వపడుతున్నానని, తమిళ ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమ ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుందని హీరో సందీప్ కిషన్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన 'సిగ్మా' సినిమా ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జేసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుండగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు.