పాత డీజిల్ వాహనాలకు రూ.5 వేలతో కొత్త లైఫ్!
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
పాత డీజిల్ ట్రక్కులు, బస్సుల యజమానులకు కేంద్రం ఊరటనిచ్చింది. కేవలం రూ.4 నుంచి 5 వేల ఖర్చుతో అమర్చే 'రెట్రోఫిట్ ఎమిషన్ కంట్రోల్ డివైజ్' (RECD) ద్వారా పాత వాహనాల కాలుష్యాన్ని బీఎస్-6 స్థాయికి తగ్గించవచ్చు. ఐఐటీ ఢిల్లీ సాంకేతికతతో రూపొందిన ఈ పరికరంతో పార్టిక్యులేట్ మ్యాటర్ 90 శాతం తగ్గుతుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు భారం లేకుండా కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.