రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా మారిన స్వతంత్రులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Rajasthan
రాజస్థాన్ పట్టణ స్థానిక స్వపరిపాలన ఎన్నికల్లో స్వతంత్రులు కీలకంగా మారారు. మొత్తం 10,235 వార్డుల ఫలితాల్లో బీజేపీ 4,179 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 3,613 స్థానాలను దక్కించుకుంది. అయితే 2,273 స్థానాలు కైవసం చేసుకున్న స్వతంత్రులు కింగ్ మేకర్లుగా నిలిచారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంతగడ్డతో సహా పలుచోట్ల బీజేపీ ఎదురుదెబ్బలు తగిలాయి.