తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం: సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలు

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాలను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పదిహేడు కోట్లకు పైగా భక్తులు వీక్షించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు, ధార్మిక కార్యక్రమాలను డిజిటల్ వేదికల ద్వారా కోట్లాది మంది తిలకించారని తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారం కారణంగా టీటీడీ అధికారిక ఖాతాల సబ్స్క్రైబర్ల సంఖ్య పదిహేడు లక్షలు దాటిందని అధికారులు పేర్కొన్నారు.