బొబ్బిలిలో కోటి ఇరవై ఐదు లక్షలతో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరై అగ్నిమాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు.